ఓం నమో భగవతే వాసుదేవాయ
సంక్షేమ పథకాలు ఎలా ఉండాలి అంటే - ప్రస్తుత దుస్థితి గట్టెకించడానికి సరైన వనరులను, ధనాన్ని, కల్పించి అదే సమయంలో మరల దుస్థితి రాకుండా, అలాగే సామజిక స్థితి మెరుగుపడేటట్లు అవసరమైన మార్పులు తీసుకురావాలి. ఎప్పుడైతే సంక్షేమ పథకాలు బాధిత వర్గాలను నిర్వీర్యం చేసేటట్లుగా అందజేస్తారో - అందులో కుట్ర ఉందని లేక నాయకత్వంలో చిత్తశుద్ధి లోపించిందని మనం భావించాలి.
అనేక ప్రభుత్వాలు శూద్ర వర్ణానికి చెందిన అనేక జాతులకు సంక్షేమ పథకాలు అందజేస్తూ ఉన్నారు.
రాజకీయ కోణంలో రిజర్వేషన్స్
ఆర్ధిక కోణంలో ఉచిత సదుపాయాలు.
ఇలా వారికి ఎన్ని తరాలకు రాయతీలు అందజేస్తే ఆ జాతి వారు వారి వృత్తిపై, సంస్కృతి పై, హైందవ ధర్మము పై అంత పట్టు కోల్పోతారు. అసలు జాతుల లేక కులాల విభజన చరిత్ర దృష్ట్యా వృత్తి ఆధారంగా అయినప్పుడు కులవృత్తిని పెంపొందించాలి. ఆ ఆయువుపట్టుతో పాటు అందరికి ప్రాథమిక విద్య. అదీ నిజమైన సంక్షేమ పథకం. ఈ విధానంగా హైందవసమాజం ఎందుకు స్పందించలేదు?
లాభం కులాలది నష్టం హైందవ సమాజానిది.
రిజర్వేషన్స్ ద్వారా శూద్ర వర్ణానికి చెందిన అనేక జాతులను మిగిలిన జాతులనుండి వేరుచేయుట. లీగల్ కోణంలో atrocity చట్టం అవసరమైనప్పటికీ అన్యకులస్తుల నుండి gap ఏర్పడుతుంది.
ఇందులో మనం చూడవలసినది ఏమిటంటే విభజన చేసి పాలించడం. divide and rule.
సంక్షేమ పథకాల సైకాలజీ
వివక్ష ఉందని గుర్తుచేసినంత కాలం ఆవేదన ఉంటుంది.
ఆవేదన ఉన్నంత కాలం పరస్పర విద్వేషం, అపనమ్మకం ఉంటాయి.
పరస్పర విద్వేషం, అపనమ్మకం ఉన్నంత కాలం విభజన ఉంటుంది
విభజన ఉన్నంత కాలం votebank రాజకీయం ఉంటుంది.
విభజన మరియు votebank రాజకీయం ఉన్నంత కాలం అన్యమత రాబందులు మరియు రాజకీయా నేతలు మనలను వారివైపు తిప్పుకుంటారు.
ఇలా ఉన్నంత కాలం హిందూ సమాజం ఐక్యం అవ్వదు.
వీటికి పరిష్కారం చూపేది ఎవరు?
శూద్ర వర్ణానికి చెందినవారు మాత్రమే పరిష్కరించగలరు. ఎందుకంటే అన్యవర్ణాల వారి నాయకత్వం మరల బానిసత్వానికి దారి తీస్తుందనే భయం ఉండవచ్చు. పైగా శూద్రులు అత్యధిక సంఖ్య లో ఉంటారు కాబట్టి వారే నాయకత్వం వహించాలి.
హైందవ సమాజంలో శూద్రుల పాత్ర - నాడు నేడు
ప్రాచీన కాలం నుండి హైందవ సమాజంలో శూద్రులు కీలక పాత్ర వహిస్తూ వస్తున్నారు. రైతులు, చేనేత వ్యాపారాలు, శిల్పులు, కంసాలులు ఇలా ఎన్నో కళలను పోషించినది ఆ వృత్తి వ్యాపారం చేసినది శూద్రులు మాత్రమే. అలాగే శూద్రులు అనేక సందర్భాలలో ఆధ్యాత్మిక జ్ఞానులు, గురువులు, రాజులు, పరమ భక్తులు, రచయితలు గా కూడా సమాజంలో పాత్ర వహించారు.
క్షత్రియులు రాజ్యపరిపాలనలో, బ్రాహ్మణులు విద్య, మంత్రి శాఖలు వంటివి పాటించగా వృత్తి వ్యాపారం చేసిన వైశ్యులు, శూద్రులు మాత్రమే అత్యధిక శాతం పన్ను కట్టేవారు అంటే శూద్రుల ఆర్ధిక స్తొమత చక్కగా ఉండేది అని మనం అర్థం చేసుకోవచ్చు. తద్వారా వారు పెద్ద పాత్ర వహించేవారని స్పష్టమవుతోంది. అందువలన కులవృత్తులను కుల సంస్కృతులను విభిన్న జాతులవారు మరల పెంపొందించుకోవాలి. వారికి సంక్షేమ పథకాలు తీసివేస్తే వారి జీవితం కష్టపాలు అవుతుందని భయభ్రాంతులకు గురిచేసి బానిసత్వాన్ని కలిగించడం భావ్యం కాదు.
ఆధునిక కాలంలో క్షత్రియుడు ఎవరు?
బ్రిటిషు సామ్రాజ్యం తరువాత నుండి దేశ పరిపాలనలో క్షత్రియుల పాత్ర క్షీణిస్తూ వచ్చింది. స్వాతంత్య్రం తరువాత వారు సామాన్య జనసమూహములో కలిసిపోయారు. పూర్వం దేశ రక్షణతో పాటుగా వారు ధర్మ రక్షణ చేసేవారు. ఈ కాలంలో ఆధునిక క్షత్రీయులు అనగా పోలీస్, మిలిటరీ, రాజకీయ వ్యవస్థ ద్వారా నాయకత్వం వహించువారు దేశరక్షణ, దేశ పరిపాలన చేయు క్షత్రీయులు మాత్రమే కానీ ధర్మ రక్షణ చేయువారు కారు. అనగా ఇప్పుడు ధర్మము సంకటంలో ఉంటే రక్షించు నాయకత్వం లేదు.
మరి క్షత్రీయుల స్థానం ఎవరు నింపుతారు?
అధిక సంఖ్యలో ఉన్న సమాజంలో ఎన్నో రంగాలలో ముందడుగులు వేసి ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా బలపడిన శూద్ర వర్ణం లో పరిగణింపబడిన జాతులు మాత్రమే ఈ స్థానాన్ని నింపగలరు. ఇందులో కొన్ని శూద్రవర్ణ జాతులు అగ్రవర్ణాలుగా మిగిలినవి వెనకబడినవి గాను పరిగణింపబడుతున్నాయి. ఏదేమైనప్పటికీ వీరందరూ కూడా ప్రగతి సాధించారు. పైన ప్రస్తావించిన అనేక కారణాలను సమకూర్చి చెప్పగలిగేది ఏమంటే సమాజం పటిష్టం అవ్వాలంటే శూద్రులు నాయకత్వము వహించాలి.
సనాతన ధర్మాచరణ పటిష్టం అవ్వాలంటే శూద్రులు నాయకత్వము వహించాలి.
సనాతన ధర్మ రక్షణ కొనసాగాలంటే శూద్రులు నాయకత్వము వహించాలి.
రాబోవు కాలాలలో నా అంచనా మేరకు పూర్వకాలపు జాతి వ్యవస్థ పూర్తిగా పరివర్తన పొంది కేవలం గుణానుగుణంగా వర్ణములు మాత్రమే ఉంటాయి. అనగా వర్ణములు ఉంటాయి గానీ పురాతనంగా కొనసాగుతున్న జాతి వ్యవస్థ పూర్తిగా పరివర్తన పొందుతుంది. ఆధునిక సమాజంలో వృత్తి ఆధారంగా జాతులు ఏర్పడు అవకాశం లేదు. కానీ ఈ లోపల vacuum ఉండడం హైందవ సమాజానికి మంచిదికాదు. అందుచేత transfer of responsibility జరిగే ఈ transition period లో జాతుల ఆధారంగా మనం ధర్మాన్ని కాపాడుకుంటూ ఎప్పుడైతే జాతి రహిత సమాజం సిద్దమవుతుందో ఆ భావితరానికి మనం భాధ్యతను అందచేద్దాము.
ఆలోచించండి హిందూ మిత్రులారా. అన్యులకు అవకాశము ఇవ్వదు. స్వధర్మము ఎప్పుడైనా మంచిది. పరధర్మము భయంకరమైనది అన్నాడు గీతాచార్యుడు. మన సమస్యలకు మనమే పరిష్కారాలు వెతుక్కోవాలి.