top of page
Search

పుస్తకాలయ Reading Zone ఆవిష్కరణ



హిందూమిత్ర ఫౌండేషన్ సౌంజన్యంతో పుస్తకాలయ Reading Zone తిరుప్పూర్ ఫామిలీ మాల్, లలితా నగర్, విశాఖపట్నం లో ప్రారంభించడం జరిగింది. హిందూమిత్ర శ్రీ జనార్దన్ గారు సనాతన ధర్మం ఆచరిస్తూ సమాజానికి ఎంతో సేవ చేస్తూ ఉంటారు. ఆయన చేపట్టిన అనేక కార్యక్రమాలలో ఒకటైన పుస్తకాలయ Reading Zone అను ఈ concept అందరినీ ఆకట్టుకుంది. పిల్లలకు పెద్దలకు ఆయన నిశుల్కంగా పుస్తకాలను చదివేవిధంగా ఈ గ్రంథాలయాన్ని మరియు book bank ని 23 జూన్ 2024 న ప్రారంభించారు. దీనికి హిందూమిత్ర ఫౌండేషన్ ప్రోత్సాహం సహకారం ఎల్లప్పుడూ ఉంటాయి.



ఈ ప్రారంభోత్సవానికి అనేకులు హాజరు కాగా అందరూ వ్యక్తపరచిన సారాంశం ఏమిటంటే మనమందరం సనాతన ధర్మ మౌలిక ఆధ్యాత్మిక విలువలను ఆచరిస్తూ సమాజాన్ని ధర్మ మార్గములో నడిపించు కృషి చేపట్టాలి అని.



ఈ కార్యక్రమంలో యువకులు బాలలు పాల్గొనగా చిన్నారులు రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించగా పెద్దలు దీప ప్రజ్వలనం చేసి శుభారంభం కావించారు. ఈ కార్యక్రమంలో శ్రీ జనార్దన్ గారు, వారి కుమారుడు శ్రీ విష్ణు చక్కటి సందేశాన్ని అందచేశారు.

హిందూమిత్ర వ్యవస్థాపకులు Dr మల్లాది శ్రీనివాస శాస్త్రి హిందూమిత్ర ఫౌండేషన్ గురించి వివరిస్తూ హిందూమిత్రులు సనాతన ధర్మ సేవకులు సమసమాజ స్నేహితులు అని మరొక్కసారి పిలుపునిచ్చారు. అందరూ శ్రీ జనార్దన్ గారి మరియు శ్రీ విష్ణు గారి ప్రయత్నాన్ని అభినందించారు.


పుస్తకాలయ ప్రతి రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు తెరచి ఉంటుంది.


హిందూమిత్ర ను సంప్రదించాలంటే ఈ సంఖ్యకు వాట్సాప్ చేయగలరు 7288000047.


 
 
 

Commentaires


Post: Blog2_Post

©2021 హిందూమిత్ర ద్వారా. Wix.comతో సగర్వంగా సృష్టించబడింది

bottom of page