top of page
Search

శిశు మానసిక సంక్షేమం - తల్లి తండ్రుల బాధ్యత

Updated: Jun 12, 2024



(హిందూమిత్ర ఫౌండేషన్ ప్రచురణ- మానసిక వైద్యనిపునుని సూచనలు)


*శిశు మానసిక సంక్షేమం - తల్లి తండ్రుల బాధ్యత *

(హిందూమిత్ర ఫౌండేషన్ ప్రచురణ- మానసిక వైద్యనిపునుని సూచనలు)

మీ చిన్నారి శిశువు జన్మించిన సందర్భానికి హార్దికాభినందనలు!


చిన్నారి ఎదుగుదలలో మీరు శారీరిక పోషకాలు ఇచ్చినట్లే మానసిక ఎదుగుదలకు కూడా సరైన పోషకాలు కల్పించు కీలక పాత్ర తల్లి తండ్రి నిర్వహించాలి.


మీ మరియు మీ తల్లితండ్రుల కాలానికి ఇప్పటి కాలానికి మొబైల్ డివైసెస్ వలన చాలా మార్పు వచ్చింది.

పూర్వం శిశువు ఎదుగుతున్న సమయంలో తల్లి, తండ్రి, తాత, అమ్మమ్మల ఆట పాటలతో పెరిగే వారు. దానితో వారి గొంతు వినబడుతుంది, పాటలతో, మాటలతో మాతృభాష మొదలవుతుంది. వారి మోహంలో ఆనందభావమును శిశువు గమనిస్తుంది. ఈ విధంగా Cognitive, Emotional మరియు Linguistic ఎదుగుదల సంపూర్ణంగా ఉంటుంది.


ఇటీవల కాలంలో తల్లి గాని తండ్రి గాని వారు మొబైల్ స్క్రీన్ లో నిమగ్నమవ్వడమే కాకుండా శైశవం నుండి కూడా వారికి మొబైల్ ఫోన్ ఇచ్చి వారిని ఊరుకోపెట్టడం, తినిపించడం వంటివి చేస్తున్నారు. మొబైల్ చాలా ఆకర్షణీయంగా ఉండుట చేత శిశువు వాటిలో పూర్తిగా నిమగ్నమయ్యి తల్లికి తండ్రికి "స్వేచ్ఛ" ఇస్తోంది. దీనితో బాధ్యతను విస్మరించి మరియు శిశువు మానసిక ఎదుగుదలకు అంతరాయం కల్గించిన వారు అవుతున్నారు. సుమారుగా ఈ కాలం తల్లి తండ్రులు అందరూ ఇదే చేస్తున్నారు. అందుచేత భావితరం వారు ఎలా పెరుగుతారో మనం అందరం ఊహించవచ్చు.


ఈ విధంగా పెరిగితే వారికి తల్లి తండ్రితో bonding (బంధుత్వం) సమంగా ఏర్పడదు. ఎందుకంటే మొబైల్ ఫోన్ ధ్వనితో పోలిస్తే తల్లి తండ్రి గొంతు మాట ద్వారా గాని పాట ద్వారా గాని స్వల్ప కాలం మాత్రమే వినబడుతుంది. పైగా మనోరంజనానికి మొబైల్ ఫోన్ ధ్వనితో, ఆదేశాలకు తల్లి తండ్రి ధ్వనితో పోలుస్తారు.


క్లుప్తంగా చెప్పాలంటే:

1.⁠ ⁠శిశువు పుట్టినప్పటి నుండి కనీసం 5 సంవత్సరాలు వచ్చే దాకా వారికి మొబైల్ ఫోన్ ఇవ్వరాదు.

2.⁠ ⁠తల్లి తండ్రి ఉద్యోగస్తులు అయినప్పటికీ శిశువు తో మాట్లాడాలి.

అంతేగాని మొబైల్ ఫోన్ శిశువుతో మాట్లాడరాదు, పాడరాదు.

3.⁠ ⁠తల్లి తండ్రి ఆటలు నేర్చుకుని శిశువు తో "తారంగం తారంగం" వంటి ఆటలు పదే పదే ఆడించాలి నవ్వించాలి.

4.⁠ ⁠జోల పాటలు, భక్తి పాటలు, సరదా పాటలు లేక మీకు నచ్చిన పాటలైనా శ్రావ్యమైన గొంతుతో పాడి వారితో అత్యధిక సమయం గడపాలి.

5.⁠ ⁠వారికి నడక వచ్చినప్పుడు దగ్గరలో పార్క్ కి లేక మీ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో ఆడించడానికి తీసుకువెళ్లాలి.

6.⁠ ⁠ఏడిస్తే ఫోన్ ఇవ్వరాదు, భోజనానికి ఫోన్ ఇవ్వరాదు. ఇస్తే వారికి ఆకలి నిండినా చెప్పకపోవడం చేత Obesity రావచ్చు.


మరిన్ని సూచనల కొరకు లేక నూతన తల్లి తండ్రుల శిక్షణ కొరకు మా హిందూమిత్ర ఫౌండేషన్ ను సంప్రదించండి 7288000047.


ధన్యవాదములు

Dr. మల్లాది శ్రీనివాస శాస్త్రి

హిందూమిత్ర ఫౌండేషన్ ద్వారా ఆరోగ్య సంక్షేమ ప్రచురణ

 
 
 

Commentaires


Post: Blog2_Post

©2021 హిందూమిత్ర ద్వారా. Wix.comతో సగర్వంగా సృష్టించబడింది

bottom of page