స్వచ్ఛ భారతం - స్వచ్ఛ దేవాలయ పరిసరం
- Srinivasa Malladi
- Jun 10, 2024
- 1 min read

హిందూమిత్రులకు విజ్ఞప్తి
మీరు మీ దగ్గరలో ఉన్న దేవాలయమును ప్రతి వారం సందర్శిస్తున్నారా?
ఆ దేవాలయం లోపల బయట శుభ్రత ఉంటోందా?
దయచేసి చూసి చెప్పండి. శుభ్రంగా లేకపొతే ఫోటో తీసి, మీ ఊరు పేరు, దేవాలయం పేరు, దేవాలయం google లొకేషన్ తో మాకు 7288000047 కు సందేశం పంపించండి.
హిందూమిత్ర సంయోగం తో మీకు స్వచ్ఛ దేవాలయం కార్యక్రమానికి సహకరిస్తాము.
అసలు ఎందుకు దేవాలయం మరియు పరిసరాలను శుభ్రంగా ఉంచాలి?
సనాతన ధర్మం అనగా ఆత్మజ్ఞానం. మనం ఆత్మస్వరూపులం అని చాటిచెప్తుంది. పరమాత్మ, నాలో ఉన్న జీవాత్మ, అలాగే సమస్త ప్రాణికోటిలో ఉన్న ఆత్మ, స్థావరంగా ఉన్న నదులలో, కొండలలో, చెట్లలో, గడ్డిలో అంతటా ఉన్న ఆత్మ సమానం అని, మనం సమదృష్టితో అంతటినీ ప్రేమించాలని, చక్కగా చూసుకోవాలని చెప్తుంది.
హిందువులమైన మనం మన దగ్గరలో ఉన్న దేవాలయం తరచూ వెళ్తుంటాము దైవ దర్శనం చేసుకుంటాము. విగ్రహరూపంలో ఉన్న ఆ పరమాత్మకు ప్రతీక అయినా ఆ ఆలయ దైవమునకు అభిషేకములు, అలంకారములు సమర్పిస్తాము. కానీ దైవ దర్శనం ముగిసాక దేవాలయ ప్రాంగణాన్ని అనగా పరిసరాలను శుభ్రంగా ఉంచటం లేదు. దైవం దేవాలయంలో ఉన్న విగ్రహం మాత్రమేనా? లేక దేవాలయ ప్రాంగణంలో ఉన్న మట్టిలో, గోడలో, చెట్లలో, గడ్డి లో కూడా దైవమున్నదా? పైన ఇచ్చిన వివరణ ప్రకారం దైవం అంతటా ఉన్నది కదా?
ఇంకొక విధంగా చెప్పాలంటే మనలో ఉన్న ఆత్మ దైవమైతే మన శరీరం ఒక పవిత్ర దేవాలయం. మన శరీరమును ఒక దేవాలయంగా భావించి ప్రతి రోజు స్నానం చేస్తూ, వాడిన బట్టలను శుభ్రం చేసి మంచి ఉతికిన బట్టలు వేసుకుంటూ, అనేక విధాల ముస్తాబు అవుతూ. ముఖ్యంగా మన శరీరమును శుభ్రంగా ఉంచుతున్నాము.
అలాగే మీరు సందర్శించే దేవాలయం విగ్రహ రూపంలో ఉన్న ఆ దైవానికి శరీరం. దానిని మనమే శుభ్రం చేసుకోవాలి.
వ్యక్తిగత, కుటుంబ, సమాజ, పర్యావరణ సమస్యలను పరిష్కరించు ప్రయత్నం చేయువాడు హిందూమిత్ర.
హిందూమిత్రులారా! మన దేవాలయాలను కాపాడుకుందాం రండి.
Commentaires