సనాతన ధర్మం ద్వారా వ్యక్తిగత వికాసం
- Srinivasa Malladi
- Aug 19, 2023
- 1 min read
లోక కళ్యాణం
సమాజ సంక్షేమం
వ్యక్తిగత వికాసం
పర్యావరణ సంక్షేమం
దీనోద్ధరణ / దీన రక్షణ
పాపపరిహారం / పాపక్షమాపణ
అనారోగ్య ఉపసమమనం
ఇవి మానవ జీవనంలో మౌలిక అంశాలు. వీటిని సనాతన ధర్మం ద్వారా ఒక హిందువు ఎలా నిర్వహిస్తాడు చూద్దాం. (ఇది వివరంగా విశ్లేషించవలసిన అవసరం ఉన్నప్పటికీ ముందర క్లుప్తంగా చూద్దాం)
వ్యక్తిత్వ వికాసం ఏర్పడిన ఒక మనిషి సాధారణంగానే తన ఆరోగ్య పరిరక్షణ కోసం ...కొన్ని కొన్ని విషయాలని అవగాహన చేసుకుని వాటిని ఆచరణ లోనికి తీసుకుంటాడు. తద్వారాగా తనకు తానుగా మార్పు చెందుతాడు, తనను తాను మార్చుకుంటాడు. ఆర్థిక విషయంలోనే గాని, ఆరోగ్య విషయంలో గానీ జాగ్రత్త వహిస్తాడు .ఆ విధంగా అనారోగ్య ఉపశమనం చెందుతాడు.
ఎప్పుడైతే మనిషి బలహీన ఆలోచనల నుండి ,శారీరక బలహీనత నుండి బయటపడతాడో....
అటువంటి వారికి దేహదారుడ్యం, ఆత్మస్థైర్యం అలబడుతుంది. అటువంటి మనిషి మాత్రమే ఇతరుల యొక్క పాపపరిహారం ను పోగొట్టగలడు. ఇతరులను పాపక్షమాపణ చేయగలడు.
శారీరకంగా మానసికంగా ఉన్నవారు మాత్రమే అద్వైత భావాలను అలవర్చుకొని ...ఐహిక బంధాలను, ఇహలోక సుఖాలను త్యజించి దీనోద్ధారణకు ,దీన రక్షణకు పూనుకుంటారు. ఇటువంటి వారి ద్వారా సమాజం చైతన్యం అయితే అటువంటి సమాజం పర్యావరణ దిశగా అడుగులు వేస్తుంది. అనుకోకుండానే సమాజంలో పర్యావరణ సంక్షేమం మార్పు మొదలవుతుంది. విధమైన మార్పు ప్రతి ఒక్కరిలో మొదలవుగానే సమాజ సంక్షేమం పరిఢవిల్లుతుంది. తద్వారాగా లోక కళ్యాణం నెరవేరుతుంది.
జైశ్రీరామ్ .
జై సనాతన ధర్మం. భారత్ మాతాకీ జై .
జై హింద్ .
నేను మీ జోగారావు
(జోగారావు గారు విశాఖపట్నంలో పెద్ద జాలరిపేటలో ప్రతి ఆదివారం పిల్లలకు భగవద్గీత, వ్యాయామం మరియు ఆధ్యాత్మిక విలువలను బోధిస్తూ ఉంటారు.)

Comments