top of page
Search

హిందూ మిత్ర అనగా ఎవరు? హిందూ మిత్రులు ఎందుకు అవసరం?


సనాతన ధర్మం అతి పురాతనమయినది. అలాగే విశ్వవ్యాప్తమయినది, వైజ్ఞానిక దృకదం కూడినది, ఆధ్యాత్మిక , మానసిక, సామాజిక పరంగా ఎంతో ఉపయోగకరమైన మార్గము. ప్రతి వ్యక్తికీ స్వేచ్ఛను కల్పించి వారికి తగినమార్గము ఎంచుకునే అవకాశం కల్పిస్తుంది. సనాతన ధర్మం ఎల్లపుడూ విశ్వవ్యాప్తమైన ఆద్యాన్తరహితమయిన సత్యమైనప్పటికీ ప్రపంచంలో ముఖ్యంగా ఆధునిక కాలంలో ఆధ్యాత్మిక ధర్మాన్ని అనుసరించే స్వేచ్ఛను ఉక్కిరిబిక్కిరి చేసే మతాలు ఉద్భవించాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచంలో భారతీయ భూమి మరియు కొన్ని ప్రముఖ ఆసియా దేశాలు మినహాయించి మిగిలిన దేశాలలో ప్రజలు మతాలను స్వీకరించడం జరిగింది. ఈ మతమార్పిడి చరిత్ర అప్పటినుండి ఇప్పటి వరకు అశాంతి, ద్వేషం, విధ్వంసం మరియు ప్రాణనష్టం తో కూడిన వ్యవహారమని మనందరికీ తెలుసు. ఆధునిక civilized సమాజంలో ఇటువంటి ప్రయత్నాలు సమంజసం కాదు కాబట్టి ఇప్పుడు వీరి చర్యలు బుద్ధిబలంతో పథకం ప్రకారం జరుగుతూ వస్తున్నాయి.

హిందూ సమాజం అనేక సమస్యలు ఎదురుకుంటోంది. రాజీవ్ మల్హోత్రా గారి రచనల ద్వారా మనకు ఒక విషయం కొట్టొచ్చినట్లు తెలుస్తుంది. ఆయన వాడిన పదం "breaking india forces" - ఇవి పశ్చాత్త్య మతాలు మరియు కమ్యూనిస్ట్ భావజాలం. వీరందరూ ఇప్పటికే హైందవసమాజంలో చొచ్చుకుపోయారు. ఉదాహరణకు రాజకీయ వ్యవస్థ, విద్య వ్యవస్థ తద్వారా వారి సిద్ధాంతాలకు అనుగుణంగా సమాజాన్ని తీర్చిదిద్దడం. వీరు ఏవిధంగా హైందవ సమాజాన్ని వారి వైపు తిప్పుకోడానికి ప్రభావితం చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు?

పశ్చాత్త్య మతాలు - వారి మత గ్రంథాన్ని పూర్తిగా విశ్వసిస్తారు. వీరి మత గ్రంథం ప్రకారం కేవలం వారి దేవుణ్ణి అంగీకరిస్తేనే పుణ్యాత్ములు మిగిలినవారు పాపులు అని వారి దృఢవిశ్వాసం.

కమ్యూనిస్ట్ భావజాలం రాజకీయా భావజాలం అయితే నాస్తికవాదం philosophical వాదం. ఇక్కడ మనం వీరిని ఒకరిగా చూడకూడదు ఎందుకంటే కమ్యూనిస్ట్ భావజాలం నాస్తికత్వంతో కూడినది అయినప్పిటికీ పాశ్చాత్య మతాలు వలే రాజకీయ దృష్టికోణం మరియు అసహనం కలిగినది. తద్వారా వారు విధ్వంసం సృష్టించడం, మరియు వర్గవివాదాలు కలిగించడం ప్రణాళిక ప్రకారం చేస్తూ వచ్చారు. అలాగే manipulative strategies వాడి విద్యావ్యవస్థ ద్వారా , మరియు చరిత్ర రచించడం ద్వారా అలాగే policies వ్రాయడం ద్వారా స్థానిక సమాజాన్ని వారు విచ్చిన్నం చేసే ప్రయత్నం చేస్తారు. యువతరాన్ని rootless గా తయారు చేయడం వారి లక్ష్యం.

ఇవి కాక globalization కూడా ఒక పెద్ద సమస్య గా భావించవచ్చు. globalization అనగా ప్రపంచం లో అందరూ ఒకలాగే ప్రవర్తించడం తద్వారా స్థానిక భాషలు, సంప్రదాయాలు, ఆధ్యాత్మికత తో కూడిన కళలు అంతరించి కేవలం ఇంద్రియాలను రంజింపచేయడానికి మాత్రమే, లేక ఆర్థికలావాదేవీలు వాలే అనగా transactional గా ఉండడం. దీని ప్రభావం - ఉదాహరణకి - విద్య వ్యవస్థ ఉద్యోగాలకోసం లేక విషయసేకరణ కొరకు మాత్రమే అని తయారైంది. వ్యక్తిత్వ వికాసం కొరకు కాదు.

హైందవ సమాజంలో ఉన్న సమస్యలు ఏమిటి?

1. సామజిక సమస్యలు: కుల వ్యవస్థ మరియు reservations? Reservations కులం ప్రకారం ఉన్నంత కాలం, కులాల మధ్యన అడ్డుగోడలు ఉంటాయి. దీని వలన నష్టం జరుగుతున్నది హిందూ ఐక్యతలో. దీని బదులు reservations ఆర్ధిక స్థితి బట్టి పెట్టినచో బడుగువర్గాలవారికి న్యాయం జరుగుతుంది. అలాగే హిందువులు రాజకీయ దృష్ట్యా విభజించబడరు.

2. ఆధ్యాత్మిక సమస్యలు: మనలో అవగాహన, మరియు ఆచరణ లో లోపాలు ఉన్నాయి.

ప్రస్తుత పరిస్థితిలో హిందువులకు అసలు శత్రువులు ఎవరు?

A. సనాతన ధర్మం పై అవగాహన లేని వారు.

B. అవగాహన ఉన్నా ఆచరించని వారు.

మరి సనాతన ధర్మం అంటే ఏమిటి? అందులో ఏమిటి ఆచరించాలి?

3. రాజకీయ సమస్యలు:

హైందవ సమాజం పై రాజకీయ పరిణామాలు

హైందవుల రాజకీయ బాధ్యత


నాయకత్వ పటుత్వం కోల్పోవడం

క్షాత్రం క్షీణించడం


4. సాంస్కృతిక సమస్యలు: తెలుగు భాష కోల్పోతే నష్టపోయేది హిందువులు మాత్రమే

5. ఆర్ధిక సమస్యలు: ఆర్ధిక సమస్యలు ఉన్నప్పుడు ఎవరు ఆదుకుంటున్నారు. మనం ఆలస్యం చేస్తున్నామా? లేక నిర్లక్ష్యం చేస్తున్నామా? లేక స్తొమత లేక సహాయం చెయ్యలేక పోతున్నామా? లేక తప్పు పద్దతిలో సహాయం చేస్తున్నామా?

ఆ సహాయం అందిస్తున్న అన్యమతస్తులకు లాభం ఏమిటి?

6. విద్య / విద్యా వ్యవస్థ సమస్యలు: ఎటువంటి విద్య పొందుతున్నారు మనపిల్లలు. హైందవ సంస్కృతి మరియు ఆధ్యాత్మిక చింతన పై విద్య పొందుతున్నారా? ఎందుకు కాదు? విద్యా వ్యవస్థ ఎవరి చేతులలో ఉంది? పరిష్కారం ఏమిటి?


ఇటీవల తమిళ్ నాడులో ఒక 12వ తరగతి చదువుతున్న అమ్మాయి మతం మారమని వత్తిడికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఇటువంటి సమస్యలు హైందవ విద్యార్థులు ఎన్ని చోట్ల ఎదురుకుంటున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. మన జీవితాలలోనే మనం ఇటువంటి సమస్యలు ఎదురుకుని ఉండవచ్చు.


7. ఆరోగ్య / ఆరోగ్య వ్యవస్థ సమస్యలు: ఆరోగ్య వ్యవస్థ నడిచే తీరు ఏమిటి? హిందువులు నర్సులు గా వృత్తి స్వీకరించే వారి సంఖ్య ఎందుకు తక్కువ? అందులో వారు మతం మారే పరిస్థితి ఎందుకు వస్తోంది?

హిందూ మిత్ర లో ఉండవలసిన లక్షణాలు

1. సనాతన ధర్మం పై కనీస అవగాహన

2. హిందూ వ్యక్తిగత, కుటుంబ మరియు సామాజిక సమస్యల పై అవగాహన.

3. హిందూ సోదరుల వ్యక్తిగత సమస్యలను తెలుసుకుని సహకారం అందించగలగడం. ఇది - సహానుభూతి, సలహాలు, home visits, మరియు practical problem solving విషయాలలో సహకరించడం.

4. సరైన సంభాషణ నైపుణ్యం కలిగి ఉండడం (verbal మరియు non-verbal) - దీనిద్వారా హిందూ బంధువుల తో చక్కగా మాట్లాడ గలగడం, వినడం వంటి communication skills నేర్చుకోవడం.

5. ఎటువంటి బేధాలు లేకుండా మరియు వివక్ష తో చూడకుండా సమదృష్టితో సమాజంలో నిజాయితీగా ధర్మ బద్ధంగా వ్యవహరించడం.

6. వాదించడం లో నైపుణ్యం కలిగి ఉండడం. ఏమి చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎటువంటి తయారీ ఉండాలి.

7. జీవితమంతా సేవ చెయ్యాలంటే అలసటలేకుండా ఎలా కొనసాగగలగాలి అని అవగాహన కలగడం.

8. కేవలం సమాజ శ్రేయస్సు కోసమే ఆనందంగా సేవ చెయ్యగలగడమే గాని ఎవరితోనూ ఇబ్బందిలో పడకుండా నైపుణ్యం కలిగి ఉండడం.



 
 
 

Comments


Post: Blog2_Post

©2021 హిందూమిత్ర ద్వారా. Wix.comతో సగర్వంగా సృష్టించబడింది

bottom of page