హిందూమిత్ర సేవ సంస్థ సార్వజనిక సమావేశం జులై 30 2023
- Srinivasa Malladi
- Aug 3, 2023
- 1 min read

హిందూమిత్ర సేవ సంస్థ సార్వజనిక సమావేశం జులై 30 2023 న జరిగింది.
విశాఖపట్నం లో నివసించు వారు మరియు పరిసర ప్రాంతాలనుండి హిందూమిత్రులు పాల్గొన్నారు.
ప్రథమం వ్యవస్థాపకులు Dr. మల్లాది శ్రీనివాస శాస్త్రి గారు హిందూమిత్ర శిక్షణ ఇచ్చారు.
తరువాత అతిథి శ్రీ రాంజీ గారు మరియు హిందూమిత్ర ట్రస్టీలు శ్రీమతి లక్ష్మీప్రభ గారు మరియు శ్రీ శ్రీరామమూర్తి గారు హిందూమిత్ర దైనందిని పుస్తకమును ఆవిష్కరించారు.
ఆరోగ్యరక్ష వైద్య శిబిరం లో సేవలందించే Dr. మాధవి గారిని. మనోమిత్ర మానసిక వైద్య శిబిరంలో సేవలందించే శ్రీ రవికాంత్ గారిని, దిమిలి గ్రామంలో భగవద్గీత మరియు భాగవత శిక్షణ ఇచ్చు శ్రీమతి పద్మ గారిని సత్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా శ్రీమతి అన్నపూర్ణ గారు sponsor చేయగా హిందూమిత్ర సోదరీమణులు సోదరులకు రక్షాబంధనం కట్టారు. కష్టమైన సుఖమైనా మనమందరం ఒకరికొకరు అండగా నిలిచి ఉండడం హిందూమిత్ర సిద్ధాంతం.





Comments